అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరుతూ శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం వద్ద వామపక్ష నాయకులు సోమవారం ధర్నా చేశారు. నాయకులు పుల్లయ్య, గురవయ్య, జాకీర్ పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఇసుకను అడ్డుకోవాలని కోరారు. అలాగే ఇసుక ట్రాక్టర్ ఢీకొని మృతిచెందిన రాజేంద్ర కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.