ఏర్పేడు మండలం పల్లాంపేట దళితవాడ పేదలకు భూ పరిహారం తక్షణమే చెల్లించకపోతే తమ భూములు దున్నుకుంటారని రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు హెచ్చరించారు. శుక్రవారం పల్లం, పల్లాంపేట దళిత గిరిజనులతో ఆయన సమావేశమై వివరాలు సేకరించారు. దళితవాడలో 30 కుటుంబాలకు సుమారు 45 ఎకరాలకు సంబంధించి భూ పరిహారాన్ని చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.