తొట్టంబేడు: రూ. 2 కోట్లు రుణాలు దుర్వినియోగం

79చూసినవారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం, చియ్యవరం గ్రామంలో పొదుపు సంఘాల నిధులు రూ. 2 కోట్లు దుర్వినియోగం అయ్యా యని పొదుపు మహిళలు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్, స్త్రీనిధి రుణాలు సుమారు రూ. 2 కోట్లు వీవోఏలు దుర్వినియోగం చేశారని, అందులో కేవలం రూ. 54 లక్షలు మాత్రమే కట్టారని, అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అడిగారు. 1995 మ్యాక్స్ చట్టప్రకారం బాధితులే గ్రామం తరుఫున పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్