ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే జిల్లా యంత్రాం వచ్చి, పీజీఆర్ఎస్ నిర్వహించి వారి ఆర్జీలను స్వీకరించడం జరిగిందనీ, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ కోరారు. సోమవారం సూళ్లూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఆర్డీఓ కిరణ్మయితో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.