తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల పరిధిలోని పెన్నెపల్లిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బాయిలర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విధితమే. గురువారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం చెన్నై, నెల్లూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.