కురబలకోట మండల సర్వసభ్య సమావేశానికి కూటమి ప్రభుత్వం తరఫున ఐదు మంది మండల స్థాయి నాయకులకు అవకాశం కల్పించాలని టిడిపి బాధ్యులు జయచంద్ర రెడ్డి జడ్పీ సీఈవో రవీంద్ర నాయుడు ని కోరారు. గురువారం కురబలకోట మండలం ఎంపీడీవో కార్యాలయం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీలు, జడ్పిటిసి ప్రజల ఓట్లతో గెలవలేదని అన్నారు. సమస్యలు పట్టించుకోని వారికి సమావేశాలు ఎందుకని అడ్డుకుంటున్నామని అన్నారు.