భక్తిశ్రద్ధలతో శ్రీరామ భజనలు

61చూసినవారు
తంబళ్లపల్లె పట్టణంలోని పురాతన శ్రీ కోదండ రామాలయంలో శ్రీనివాస భజన కళాకారుల సంఘ సభ్యులు శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో శ్రీరామ భజనలు చేశారు. అర్చకులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తర్వాత భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులు స్వామివారిని స్తుతిస్తూ పాటలు పాడారు. ప్రతి శనివారం రాత్రి 8 గంటల నుంచి 12 వరకు భజనలు చేస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్