నా భర్తకు ఒక్క అవకాశమివ్వండి

566చూసినవారు
నా భర్తకు ఒక్క అవకాశమివ్వండి
టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డికి ఒక్కసారి ఎమ్మెల్యే అవకాశమిచ్చి గెలిపించాలని ఆయన సతీమణి కల్పన రెడ్డి కోరారు. టీడీపీ మండలాధ్యక్షుడు పాలగిరి సిద్ద, నాయకులతో కలసి మంగళవారం పాత ములకలచెరువు, రాగిమానుపల్లెల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్