నిండుగర్భిణితో ఓ కుటుంబం ఆటోలో బయల్దేరగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గర్భిణితోపాటు మరో ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ వివరాల ప్రకారం.. కురబలకోటకు చెందిన ఫాతిమా, మహమ్మద్ భాష, తొమ్మిది నెలల గర్భిణి గౌసియాతో పాటు మరో వ్యక్తి శుక్రవారం అంగళ్ళకు ఆటోలో బయలుదేరారు. కురబలకోట మలుపు వద్దకు రాగానే ఆటో ముందు టైరు పగిలిపోయి ప్రమాదానికి గురైందని ఆయన వివరించారు. ఈ క్రమంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడినట్లు వివరించారు. బాధితులను 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు.