కురబలకోటలో చిరు జల్లులు.. చల్లబడ్డ వాతావరణం

6937చూసినవారు
అంగళ్ళు-ములకలచెరువు మార్గంలో శుక్రవారం సాయంత్రం చిరు జల్లులు కురిసాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. రోడ్లు తడిచేలా సుమారు 10నిమిషాల పాటు తేలికపాటి వర్షం కురిసింది. ఈ తుంపర్ల వాన వల్ల రైతులకు ఉపయోగం లేనప్పటికి. గత 2నెలలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మండుతున్న ఎండలు, వడగాలులతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మరో గంట ఇలాగే వర్షం కురిసి ఉంటే వాతావరణం చల్లబడేదని ప్రజలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్