ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

58చూసినవారు
ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
సైబర్ క్రైమ్, మీ సేవ ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. తిరుపతిలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీసు సాంకేతిక నిపుణులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. అధునాతన పరిజ్ఞానంతో నేర శోధనలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. సైబర్ క్రైమ్ జరిగిన గోల్డెన్ అవర్స్ లో నగదును వెంటనే బాధితులకు జమ అయ్యేలా చూడాలన్నారు. మొబైల్ హంట్ పని తీరును ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్