తిరుమలలో తెలంగాణ యువకుడి అదృశ్యం

50చూసినవారు
తిరుమలలో తెలంగాణ యువకుడి అదృశ్యం
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన తెలంగాణకు చెందిన యువకుడు తిరుమలలో అదృశ్యమైన ఘటన సోమవారం వెలుగు చూసింది. తిరుమల వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు. గద్వాల్ జిల్లా, గట్టు గ్రామానికి చెందిన పిల్లి తిమ్మప్ప కుమారుడు పిల్లి నవీన్(20) 1వ తేది తప్పిపోయాడు. అతనికి మతిస్థిమితం సరిగా లేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. దీనిపై తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్