ఉదయనిధి స్టాలిన్ కు పవన్ పరోక్ష హెచ్చరిక

78చూసినవారు
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరోక్షంగా ధ్వజమెత్తారు. గురువారం తిరుపతిలో జరిగిన వారాహి సభలో “సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలకుంటే, వారే తుడిచిపెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా” అంటూ పవన్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్