ఎస్ఏఏ రాష్ట్ర అధ్యక్షునిగా సుబ్బారావు ఎన్నిక

66చూసినవారు
ఎస్ఏఏ రాష్ట్ర అధ్యక్షునిగా సుబ్బారావు ఎన్నిక
తిరుపతి టీపీయం స్కూల్లో ఆదివారం స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా శరత్ బాబు, అధ్యక్షులుగా చింతల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా నరోత్తమ రెడ్డిని, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన ప్రభుత్వం జీవో నెం. 117 రద్దుచేసి తెలుగు మీడియం కొనసాగించాలన్నారు. సీపీఎస్ రద్దు, బదిలీలు, పీఆర్సీ సమస్యలు పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్