తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేది వరకు జరిగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి సోమవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో టీటీడీ అధికారులు, పోలీసులకు వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.