తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ కే. లక్ష్మణ్ శనివారం కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఆలయం వెలుపల లక్ష్మణ్ మాట్లాడుతూ. వైకుంఠ ద్వాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఆరు మంది భక్తులు చనిపోవడం హృదయాన్ని కలచివేసిందన్నారు.