తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్ను శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4. 30 నుండి 5. 30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.