వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో 8వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ లో 7 మంది బాధితులకు శనివారం పరిహారాన్ని టీటీడీ ఛైర్మన్ బీ. ఆర్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందజేస్తున్నామన్నారు.