వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలోని స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ఆశా, ఆరోగ్య సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డా. నిత్య ప్రశాంతి మాట్లాడుతూ. ప్రస్తుతం గ్రామాల్లో డెంగీ, మలేరియా, విషజ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హ్యుమన్ మెటా న్యూమోనియా వైరస్ కలవరపాటు చేస్తుందని, భయపడకుండా జాగ్రత్త వహించాలని సూచనలు చేశారు.