వెంకటగిరి పట్టణంలోని నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎంపీపీ తనూజ శివారెడ్డి ఘన స్వాగతం పలికారు. వెంకటగిరి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి ఆనం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ భానుప్రియ, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.