AP: సీఎం చంద్రబాబు ఏప్రిల్ ఒకటో తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చిన గంజాం మండలం చిన్న గొల్లపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని.. నిరుపేద కుటుంబాలకు పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజా వేదిక ద్వారా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. సభ పూర్తి కాగానే బాపట్ల జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహిస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్ష ఉంటుంది.