ఏపీ ప్రజలకు ఎండల నుంచి భారీ ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 3వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి దక్షిణ కోస్తా ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.