అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాలు విద్యార్థులను తమ దేశాన్ని వదిలి వెళ్లండి అని చెప్తుంటే.. ఆస్ట్రేలియా మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి 2025లో అత్యధిక విద్యార్థి వీసాలు పొందిన దేశాల జాబితాలో భారత విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. ఇది ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులకు పెరుగుతున్న విద్యా అవకాశాలను, వారి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది.