అమెరికా మిన్నెసోటాలోని బ్రూక్లిన్ పార్క్‌లో శనివారం ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఓ ఇంటిపైకి విమానం దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందారు. విమానం అయోవా నుంచి మిన్నెసోటా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానం కుప్పకూలడంతో అగ్నికి ఆహుతైన ఇంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.