AP: తిరుమలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. టీటీడీ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరాహ స్వామి ఆలయంలో వీఐపీల దర్శనాలపై అధికారులను నిలదీశారు. క్యూలైన్లలో గంటల తరబడి ఉన్నవాళ్లని కాకుండా.. సిఫార్సు చేసిన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.