ఏపీలో స్పెషల్ పోలీసుల ధర్నా

68చూసినవారు
ఏపీలో స్పెషల్ పోలీసుల ధర్నా
తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన ఏపీ స్పెషల్ పోలీసులు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు శాఖ ఎటువంటి నోటీసులు లేకుండా 2156 మందిని ఉద్యోగాల నుండి తొలగించారని చెబుతున్నారు. ప్రస్తుతం త‌మ‌కు ఎలాంటి ఆరోగ్య భద్రత, ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు లేవ‌న్నారు. ఉద్యోగ భద్రత కల్పించి 2,156 కుటుంబాలను ప్రభుత్వమే కాపాడాలని ఏపీ స్పెషల్ పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్