AP: భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు 627 గ్రామాల్లో అమలవుతున్న నేపథ్యంలో సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేసింది. ఉదయం 10 నుంచి సాయత్రం 5.30 గంటల వరకు 8143679222 నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలను తెలియజేయవచ్చు. రీ సర్వే సందర్భంలో యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు మూడు సార్లు అవకాశం ఉంది. అప్పటికీ రాకపోతే వీడియోకాల్ ద్వారా హద్దుల ఖరారు చేస్తారు.