నాపై కేసులను కొట్టేయండి: పోసాని

54చూసినవారు
నాపై కేసులను కొట్టేయండి: పోసాని
AP: తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్లపై విచారించే అవకాశం ఉంది. మతం, జాతి, నివాసం, భాష ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా తాను వ్యాఖ్యలు చేయలేదని, తనపై పెట్టిన కేసులు చెల్లవని పోసాని తెలిపారు. తప్పుడు కేసుల్లో తనను ఇరికించారని ఆరోపించారు. కర్నూలు, పాతపట్నం, విజయవాడ, ఆదోనిలో నమోదైన కేసులను కొట్టేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్