AP: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గున్నమ్మ అనే వృద్ధురాలిని.. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కామేశ్వరి వీధిలో గున్నమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. గున్నమ్మ మంగళవారం కూడా పూలు సేకరిస్తుండగా.. 85 ఏళ్ల వృద్దురాలిని ముక్కు పుడక కోసం దుండగలు 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి హత్య చేశారు. ముక్కు కోసి ఆభరణాలు దొంగిలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.