8 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్

80చూసినవారు
8 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కరే టీచర్
జార్ఖండ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో దయనీయపరిస్థితులు వెలుగుచూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7,930 ప్రభుత్వ పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్నారని.. ఈ స్కూల్స్‌లో 3.81 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 103 పాఠశాలల్లో విద్యార్థులు లేరని, వాటిలో 17మంది ఉపాధ్యాయులను నియమించారని అన్నారు. దీంతో ఈ సమస్యను ఎదుర్కోవడానికి 26 వేల మంది అసిస్టెంట్ టీచర్లను నియమించేందుకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్