ప్రజలకు కనీసం పరిశుభ్రమైన తాగునీరు అయినా అందించలేరా?: వైసీపీ ట్వీట్

81చూసినవారు
AP: కూటమి సర్కార్ పై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. "తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడం చేతగాని నువ్వు విజనరీవా చంద్రబాబూ? అనకాపల్లి ఆదివాసీలకు తాగునీరు కూడా ఇవ్వడం లేదు. ఆదివాసీ మహిళలు వర్షపు చెలమల్లో బురదనీరు తాగుతున్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలివ్వలేరు.. సంపదా సృష్టించలేరు..కనీసం పరిశుభ్రమైన తాగునీరు అయినా అందించలేరా? " అని వీడియో షేర్ చేసింది. అలాగే ట్వీట్‌లో @ncbn, @PawanKalyan అని ట్యాగ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్