మండపేట: పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టండి
మండపేట పట్టణ పరిధిలోని 20వ వార్డు గొల్ల పుంత వైస్సార్ కాలనీలో పార్కు నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ టి. రంగారావుతో కలిసి గురువారం వార్డులోపర్యటించి పార్కు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డ్ జనాభాను దృష్టిలో ఉంచుకుని అందరికి ఉపయోగపడేలా పార్కు నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.