నల్లూరు సొసైటీలో అవకతవకలపై విచారణ

67చూసినవారు
కపిలేశ్వరపురం మండలం నల్లూరు సొసైటీలో అవకతవకలపై అసిస్టెంట్ రిజిస్ట్రార్ వి. జవహర్ శనివారం విచారణ చేపట్టారు. సొసైటీ డిపాజిట్ సొమ్ము రూ. 79 లక్షలు పక్కదారి పట్టినట్లు కొంతమంది సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో ఈ విచారణ చేపడుతున్నట్లు ఆయన శనివారం తెలిపారు. ఎరువుల విక్రయాల్లో కూడా అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వచ్చినట్లు జవహర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్