ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక

51చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిడదవోలు మండలం శెట్టిపేట ఎంపీపీ-2 పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎన్. కృష్ణకుమారి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. గతంలో కొవ్వూరు, నిడదవోలు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా కూడా ఆమె అవార్డులు అందుకున్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ తనకు వచ్చిన ఈ అవార్డు తమ పాఠశాల పిల్లలు ఇచ్చిన అవార్డుగా ఉందన్నారు. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్