న్యాయవాదుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 24వ తేదీ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట న్యాయవాదులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.