తూ. గో. జిల్లాలో 6, 20, 694 మందికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని కలెక్టర్ మాధవీలత శనివారం తెలిపారు. పంపిణీ సమయంలో ఓటర్ సమగ్ర సమాచారం, ఓటు వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. రాజమండ్రి అర్బన్‌లో 1, 00, 992, రూరల్లో 1, 03, 396, అనపర్తిలో 65, 155, రాజానగరంలో 1, 07, 731, కొవ్వూరులో 74, 800, నిడదవోలులో 1, 05, 724, గోపాలపురంలో 62, 836 ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారన్నారు.