రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో ఉన్న ఎన్. టి. సి నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికార సంస్థలో మహిళలకు టైలరింగ్, స్వీట్స్ తయారీ, బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ జిల్లా మేనేజర్ సీహెచ్వీ నరసమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సు కాల పరిమితి ఒక నెల ఉంటుందని, ఈ నెల 23 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి కలిగిన 18 - 45 ఏళ్లలోపు మహిళలు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.