ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యకు నిరసన సెగ

51చూసినవారు
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ఇన్నీసుపేటలో శుక్రవారం గోరంట్ల పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు, గ్రామస్తులు గోరంట్ల ను నిలదీశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఇన్నీసుపేట సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. దీంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్