కడియం డ్వాక్రా కార్యాలయంలో యూనియన్ బ్యాంకు వారి సౌజన్యంతో గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ పలు గ్రామాలకు చెందిన మహిళలకు అగర్బత్తీల తయారీ విధానంలో గురువారం ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలకు స్వయం ఉపాధి పొందడం కోసం శిక్షణ అనంతరం వారికి పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్స్ అందజేస్తామని అధికారులు చెప్పారు. అలాగే బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేస్తామన్నారు.