పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం ఐదో రోజు భౌతిక శాస్త్రం పరీక్ష అమలాపురం మండల పరిధిలోని 12 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. 41 ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ చెందిన మొత్తం 2162 విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 20 మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. మొత్తం 2162 మంది విద్యార్థులకు, 2142 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఎంఈఓ సూర్య ప్రకాష్ తెలిపారు.