విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల స్థాయిని తెలుసుకునేందుకు నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వేను విజయవంతం చేయాలని కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం పిలుపునిచ్చారు. ఈ సర్వే నిర్వహించేందుకు మినహాయించిన విద్యార్థులకు నిర్వహించిన పునశ్చరణ ఓరియంటేషన్ తరగతులను అమలాపురంలోని జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల వద్ద శుక్రవారం ఆయన ప్రారంభించారు. అభ్యసన సామర్థ్యాలపై అవగాహన కల్పించారు.