కోనసీమలో కొబ్బరి ముడి సరుకు ఆధారంగా విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకై ఉద్యాన, పరిశ్రమల శాఖ అధికారులు సమన్వయంతో ఎక్స్ పోజర్ సందర్శన చేసి అధ్యయనం చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆయన జిల్లా పరిశ్రమల కేంద్రం కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల గురించి ఆయన చర్చించారు.