అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ మేరకు ఉప్పలగుప్తం మండలంలో ఏనిమేటర్ గా పనిచేస్తున్న అయితాబత్తుల దుర్గాభవాని గ్రూపులు సభ్యులు చెల్లించిన నగదులో దాదాపు పది లక్షల వరకు తేడాలు ఉన్నాయని, దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలని పేరాయి చెరువు గ్రామానికి చెందిన సమైక్య అధ్యక్షురాలు పెయ్యిల అర్జమ్మ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.