అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్లో ఒక పాము శనివారం హల్చల్ చేసింది. కలెక్టరేట్లోని గోదావరి భవన్ వద్ద పాము ఉండడాన్ని గుర్తించిన సిబ్బంది స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మకు సమాచారం అందించడంతో అతను ఘటనా స్థలానికి చేరుకొని పామును పట్టుకొని డబ్బాలో బంధించారు. ఈ సందర్భంగా గణేశ్ వర్మ మాట్లాడుతూ ఆరడుగుల పామును పట్టుకున్నట్లు తెలిపారు.