అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 216 జాతీయ రహదారి విస్తరణ పనులు, కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణ పనుల విషయంలో ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిష్కరించి, పనుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులకు సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. భూ సేకరణ, కోర్ట్ కేసులు, పెండింగ్ లో ఉన్న అంశాలపై వారితో చర్చించారు.