వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పట్టణ వైసీపీ అధ్యక్షుడు సంసాని బుల్లి నాని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణ వైసీపీ పార్టీ సమావేశం వాసర్ల గార్డెన్స్ లో గురువారం నిర్వహించారు. నాని మాట్లాడుతూ. ధర్నాకు భారీగా తరలి రావాలని కోరారు.