సంక్రాంతి పండుగ నెల ప్రారంభం కావడంతో గ్రామాల్లో గంగిరెద్దులు సందడి ప్రారంభమైంది. డిసెంబరు 16 నుంచి జనవరి నెల 15 వరకు ధనుర్మాసం ఉండడంతో గంగిరెద్దులతో కళాకారులు నెల రోజులు భక్తి గీతాలు, జానపద పాటలతో ఇంటింటికీ వెళుతూ సందడి చేస్తున్నారు. హిందూ సాంప్రదాయాలతో సంక్రాంతి పండుగ సందడిగా సాగుతుంది. అమలాపురం రూరల్ మండలం రోళ్లపాలెం ప్రాంతంలో బుధవారం గంగిరెద్దులతో జానపద గేయాలు పాడుతూ కనిపించారు.