మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్, ప్రమోషన్, బదిలీలు, సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. అమలాపురం పట్టణంలోని గడియారస్తంభం సెంటర్ లో గాంధీ విగ్రహం వద్ద గురువారం యూటీఎఫ్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.