టీడీపీ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సూచించారు. అమలాపురంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆయన గురువారం టీడీపీ అమలాపురం నియోజకవర్గం క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణపై ఆయన వారికి సూచనలు చేశారు.