అమలాపురం జిల్లా కలెక్టర్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్ డ్రైవర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రూ. 7, 870 జీతానికి డ్రైవర్లు పనిచేస్తున్నారని, వారికి రూ. 18, 500 కి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.